చైనా కుట్రలకు మోదీ మౌన మెల : ఏపీసిసి సమన్వయ కమిటి సభ్యురాలు సుంకర పద్మశ్రీ విజయవాడ జూన్ 18 (అంతిమ తీర్పు) : దేశ రక్షణకై మన తెలుగు బిడ్డ కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరికొంత మంది వీర మరణం పొందారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర సైనికులకు అశ్రునివాలి అర్పిస్తున్నాం .మా దేశ సైనికులను చంపడానికి, నా దేశ భూభాగాన్ని అక్రమించుకోవడానికి చైనాకు ఎంత ధైర్యం ?. చైనా కుట్రలు చేసి సైనికులను చంపుతూ ఉంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 19న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడంలో ప్రధాని మోదీ బిజీబిజీగా ఉన్నారు. చైనాకు వ్యతిరేకంగా మనం ఏం చర్యలు తీసుకుంటామో ప్రజలకు చెప్పాలి. ఎన్నికల ముందు ఇలాగే దాడులు జరిగితే సైనికుల కోసం తాను పోరాటం చేస్తాను సైనికుల జోలికి వస్తే తన ఛాతీ 56 అంగుళాలు ఉప్పొంగుతుంది ఉద్వేగంతో ప్రసంగాలు చేసిన మోదీ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు. ప్రధాని మోదీ బయటకు వచ్చి 56 అంగుళాల ఛాతీ చూపించాలి. దేశంలో ఏ ప్రధాని తిరగనన్ని దేశాలు తాను తిరిగానని మోదీ చెబుతూ ఉంటారు. మహత్మగాంథీ, నెహ్రు , ఇందిర గాంది తో పొల్చూకొవాలని ప్రధాని మోదీ, అతని అనుచరులు తాపత్రయపడుతుంటారు .గత కొన్ని దశబ్దాలుగా పాకిస్తాన్ తో మనకు వైరం ఉంటే స్నేహపూర్వక సంబధాల పేరుతో ప్రధాని మోదీ పాకిస్తాన్ ప్రధాని పుట్టినరోజుకు ఆహ్వనం లేకపోయిన హాజరవుతారు. చైనా ప్రధానిని ఇండియాకు ఆహ్వనించి బోజనం పెట్టి పంపిస్తారు.ఇదే చైనా మన భారతీయ భూబాగాన్ని అక్రమించుకుని, మన సైనికుల ప్రాణాలను తీసింది..నేపాల్ కూడా కాలు దువ్వుతుంది .విదేశాంగ ,రక్షణ శాఖ ,నిఘా విబాగంలో లోపాలు ఉన్నట్లు కనిపిస్తోంది. మన పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు , పరిణామాలపై ప్రదాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలి.