*వింజమూరులో ఒక మోస్తరు స్థాయిలో వర్షం* వింజమూరు, జూన్ 24 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులో బుధవారం సాయంత్రం ఒక మోస్తరు స్థాయిలో వర్షం కురిసింది. ఉదయం నుండి ఆకాశం మేఘావృతమైనప్పటికీ సాయంత్రానికి గానీ వరుణుడు కరుణించలేదు. నాలుగున్నర గంటల నుండి క్రమేణా పెరిగిన వర్షం పలు ప్రాంతాలలో విపరీతంగానూ మరికొన్ని ప్రాంతాలలో పాక్షికంగానూ కురిసింది. ఇటీవల కాలంలో రుతు పవనాలు ప్రవేశించినప్పటికీ ఎండ వేడిమి తగ్గకపోగా ప్రజలు ఉక్కపోతతో తల్లడిల్లిపోయారు. ప్రతినిత్యం కూడా ఆకాశం మబ్బులు కమ్ముకోవడం చివరికి వరుణుడు ఉసూరుమనిపించడం పరిపాటిగా మారిపోయింది. అయితే బుధవారం సాయంత్రం కురిసిన వర్షం కుంటలలో, చెరువులలో నీటిని నింపకపోయినప్పటికీ వాతావరణం కొంతమేర చల్లబడే సూచనలు కనిపించాయి. బీకర శబ్ధాలు ఉరుములు మెరుపులు లేకుండా కురిసిన ఈ వర్షం ప్రజలకు ఉపశమనమును కలిగింపజేసింది.