*వింజమూరులో మద్యం షాపుపై నెల్లూరు ఎక్ష్సైజ్ దాడులు* కేసు నమోదు.... వింజమూరు, జూన్ 26 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని బంగ్లాసెంటర్ వద్ద రోడ్లు భవనాల శాఖ అతిధిగృహం ఎదురుగా ఉన్న మద్యం షాపుపై నెల్లూరు ఎక్షైజ్ ఎస్.ఐ కే.వి.ఆర్. ఆంజనేయులు నేతృత్వంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎక్షైజ్ ఎస్.ఐ ఆంజనేయులు మాట్లాడుతూ బంగ్లాసెంటర్ నందు మద్యం దుకాణంలో ఒక బ్రాండ్ మద్యం బాటిళ్ళపై ముద్రించిన యం.ఆర్.పి ధరల కంటే అధికంగా 20 రూపాయలు వసూళ్ళు చేస్తున్నట్లు జిల్లా ఎక్షైజ్ సూపరింటెండెంట్ కు సమాచారం అందిందన్నారు. ఇ.ఎస్ ఆదేశాల మేరకు అకస్మిక దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ముందుగా తమ కానిస్టేబుల్ ను రహస్యంగా మద్యం షాపుకు కొనుగోలు నిమిత్తం పంపామన్నారు. షాపులో కౌంటర్ వద్ద నున్న ఉద్యోగులు సదరు మద్యం క్వార్టర్ బాటిల్ ధర 180 రూపాయలు యం.ఆర్.పి ఉన్నప్పటికీ అదనంగా మరో 20 రూపాయలు చెల్లించాలని 200 రూపాయలు వసూలు చేశారన్నారు. అంతేగాక ఒక వ్యక్తికి 3 బ్మద్యం బాటిళ్ళు మాత్రమే అందజేయాల్సి ఉండగా 5 బాటిళ్ళు ఇవ్వడం కూడా నేరంగా పరిగణిస్తున్నామన్నారు. షాపు నందు స్టాకును పరిశీలించడంతో పాటు అధిక ధరల విక్రయాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయడం తధ్యమన్నారు. పూర్తి వివరాలతో నివేదికలు తయారుచేసి ఉన్నతాధికారులకు అందజేయనున్నామన్నారు. ఈ దాడులలో వింజమూరు ఎక్షైజ్ ఎస్.ఐ శ్రీనివాసరావు, వారి సిబ్బంది పాల్గొన్నారు.