న్యాయవాద వృత్తిలో వింజమూరు మణిమాణిక్యం - స్పెషల్ పి.పిగా దాట్ల.రమణారెడ్డి వింజమూరు, జూన్ 26 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని చింతలపాళెం గ్రామానికి చెందిన కీ.శే. దాట్ల.ఓబులురెడ్డి-పుల్లమ్మ ల కుమారుడు దాట్ల.రమణారెడ్డి న్యాయవాద వృత్తిలో మరొక అడుగు ముందుకు వేసి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమింపబడి వింజమూరు కీర్తి ప్రతిష్టలను నలుదిశలా విస్తరింపజేశారు. దాట్ల.రమణారెడ్డికి ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల మండల ప్రజలు కుల మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే వింజమూరు మండలంలోని చింతలపాళెం గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన దాట్ల.రమణారెడ్డి చిననాటి నుండి సేవాభావాలు కలిగి ఉండటంతో పాటు యుక్త వయస్సులోనే న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా 2005 నుండి ఆయన వివిద విభాగాలలో ఉత్తమ సేవలు అందించారు. 2013 నుండి నెల్లూరు 5 వ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నందు ప్రభుత్వం తరపున ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ నందు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నారు. చురుకైన స్వభావం కలిగిన రమణారెడ్డి 2016 లో ది నెల్లూరు బార్ అసోషియేషన్ కు ప్రతిష్టాత్మకంగా జరిగిన హోరాహోరీ ఎన్నికలలో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి బార్ అసోషియేషన్ సం యుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పట్లో రమణారెడ్డి ఎన్నిక అన్ని వర్గాలలో సంచలనం రేకెత్తించింది. వింజమూరు ప్రాంతంలో పలువురికి న్యాయ సేవలు అందించేందుకు ఆయన చేసిన కృషిని నేటికీ ఈ ప్రాంతంలో ప్రజలు చర్చించుకుంటూనే ఉంటారు. దాట్ల.రమణారెడ్డి నిబద్ధతను గుర్తించిన ప్రభుత్వం తాజాగా ఆయనను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించడం అభినందనీయమని మేధావి వర్గాలు హర్షాతిరేకాలను వెలుబుచ్చుతున్నాయి. యువకుడైన రమణారెడ్డి న్యాయవాద వృత్తిలో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించడంతో పాటు ఇప్పటికే పేదల పాలిట పెన్నిధిగా పిలవబడే దాట్ల.రమణారెడ్డి ఆయా వర్గాల ప్రజల ఆశాజ్యోతిగా నిలవాలని సర్వత్రా మండల ప్రజలు ఆకాం క్షిస్తున్నారు.