విజయవాడ.... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ. కరోనా లాక్ డౌన్ కారణంగా గత 3 నెలలుగా రాష్ట్రంలోని చేతివృత్తిదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం మత్ష్యకారులకు, చేనేత కార్మికులకు, నాయీబ్రాహ్మణులకు, రజకులకు,దర్జీలకు మాత్రమే ప్రభుత్వం కొద్దిపాటి సహాయం అందించింది. మిగిలిన 23రకాల చేతివృత్తిదారుల పరిస్థితి దయనీయంగా ఉంది. చేతి వృత్తిదారుల కుటుంబానికి 6 నెలల పాటు నెలకు రు.10 వేలు ఆర్థిక సహాయం, 50 కేజీల బియ్యం, 50 కేజీల గోధుమలు రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా ఉచితంగా ఇవ్వాలి. చేతి వృత్తిదారులు కార్పొరేషన్లు, బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను రద్దు చెయాలి. వృత్తిదారుల కార్పొరేషన్ల ద్వారా ప్రతి వృత్తిదారునికి కనీసం రు.2 లక్షలు రుణం సబ్సిడీపై ఇవ్వాలి.