విజయవాడ *ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ కామెంట్స్* ఎవడబ్బ సొమ్ము అని వైసీపీ ప్రభుత్వం పంచాయితీ కార్యాలయాలకు రంగులు వేశారు ? సుప్రీమ్ కోర్టు వరకు వెళ్లి అంధ్రప్రదేశ్ పరువు తీసి ఇప్పుడు మళ్ళీ ప్రజల సొమ్ముతో తెల్ల రంగు వేస్తున్నారు *డెత్ సర్టిఫికెట్ మీద కూడా ముఖ్యమంత్రి జగన్ తన బొమ్మ వేసుకున్నారు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు* సాధారణంగా గొప్ప నాయకుల పేర్లు పథకాలకు లేదా చనిపోయిన నాయకుల పేర్లు, బొమ్మలు వేస్తారు *కానీ ఏపీలో అంతా రివర్స్.... కార్పొరేషన్లు నిర్వహించే సులబ్ కాంప్లెక్స్ కి జగనన్న సులబ్ కాంప్లెక్స్ అని పెట్టిన ఆశ్చర్యం లేదు* మన ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రికి జైలుకి వెళ్తాను అని భయం లేదా మళ్ళీ ప్రజలు అవకాశం ఇవ్వరు అని అర్థం అయినట్లు ఉంది *అమరావతి రాజధానిగా ఉంటే చంద్రబాబు పేరు చిరస్ధాయిగా ఉంటుందని 3 రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారు* తెలుగు ప్రజల తరుపున ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం కావాలంటే "జగనన్న రాజధాని" "జగనన్న కాపిటల్" గా పేరు పెట్టుకోండి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడి, రాజధాని నిర్మాణం కోసం 33000 ఎకరాలు ఇచ్చిన రైతు కుటుంబాలకు న్యాయం చేయండి


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం