*పెట్రోలు బంకును తనిఖీ చేసిన తహసిల్ధారు* వింజమూరు, జూన్ 30 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు-కావలి రోడ్డులోని సుభాషిని ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ ను మంగళవారం సాయంత్రం తహసిల్ధారు యం.వి.కే.సుధాకర్ రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్రోలు, డీజిల్ నిల్వలను, రికార్డులలో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. వాహనాలకు పెట్రోలు, డీజిల్ నింపే సమయంలో డిజిటల్ మీటర్లను పరిశీలిస్తూ ధరల వివరాలను వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెట్రోలు బంకు నిర్వాహకులకు, సిబ్బందికి తహసిల్ధారు పలు సూచనలు చేశారు.