గవర్నర్ ప్రసంగం 5 కోట్ల ప్రజల్లో ఆందోళన :ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ విజయవాడ జూన్ 16 (అంతిమ తీర్పు) : రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే మూడు రాజధానుల అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకుని గవర్నర్ ప్రసంగించారు మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామని గవర్నర్ ప్రసంగించడం దారుణం గవర్నర్ ప్రసంగంతో ఐదు కోట్ల ఆంధ్రులు ఆందోళనకు గురౌతున్నారు రాష్ట్రాభివృద్ధి కోసం 29 గ్రామాల ప్రజలు తమకు అన్నం పెడుతున్న భూమిని రాజధాని కోసం త్యాగం చేశారు రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు గవర్నర్ ఏం సమాధానం చెబుతారు ? అమరావతే రాజధానిగా ఉండాలని మహిళలు పోరాటం చేస్తుంటే పోలీసులు వారిపై అక్రమ కేసులు పెట్టారు అయినా వారు వెనక్కి తగ్గకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు ఏపీలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుంది.... కరోనా వల్ల మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది కరోనాను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో గవర్నర్ ప్రజలకు వివరిస్తే బాగుండేది అలా కాకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పడం సరికాదు మరొకవైపు రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు పోలవరం ప్రాజెక్టును పట్టించుకునే నాధుడే లేడు