*వింజమూరులో సీనియర్ మేట్ పై సస్పెన్షన్ వేటు* అంతిమ తీర్పు న్యూస్ కు స్పందన..... వింజమూరు, జూలై 10 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): గ్రామాలలో వలసలను నివారించి పేద ప్రజలకు కూడు, గుడ్డ, నీడ కల్పించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వైపు కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తుండగా పలువురు అడ్డగోలుగా ఆ నిధులను దిగమింగేందుకు దొడ్డిదారిన చేస్తున్న ప్రయత్నాలకు ఎట్టకేలకు వింజమూరు యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ చెక్ పెట్టి ఉపాధిలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లయిందని వింజమూరు పంచాయితీ పరిధిలో ఉపాధిహామీ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే వింజమూరులోని పాతూరుకు చెందిన ఉపాధిహామీ మాలకొండస్వామి, పద్మనాధ గ్రూపులకు చెందిన ఉపాధిహామీ కూలీలు గురువారం నాడు యం.పి.డి.ఓ కార్యాలయానికి వచ్చి తాము ఉపాధిహామీ పనులలో కాయకష్టం చేస్తున్నా తమ శ్రమకు తగిన ఫలితం రాకపోగా వారాంతానికి 206 రూపాయలు, 149 రూపాయలు, అంతకంటే దారుణంగా మా అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని యం.పి.డి.ఓకు మొర పెట్టుకున్నారు. తక్షణమే స్పందించిన ఆమె ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ ఇంచార్జ్ ఏ.పి.ఓను పిలిపించి చిచారణకు ఆదేశించారు. విచారణలో సదరు మేట్ బోయిన.రమణయ్య ఉపాధిహామీ పనుల విషయంలో తన స్వార్జితం చూసుకుంటున్న విషయాలు భాధిత కూలీల ద్వారా ఆమె దృష్టికి రావడంతో వెనువెంటనే సదరు మేట్ పై చర్యలు తీసుకున్నారు.
Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
• Valluru Prasad Kumar
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
• Valluru Prasad Kumar
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
• Valluru Prasad Kumar
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
• Valluru Prasad Kumar
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn