*రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి* ఉదయగిరి, జూలై 10 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండల కేంద్రానికి సమీపంలో మోడల్ స్కూలు వద్ద కారు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలలోకి వెళితే దుత్తలూరు మండలంలోని రాచవారిపల్లి గ్రామానికి చెందిన కొంకల.వెంకటసుబ్బారెడ్డి ఎన్.హెచ్ 565 జాతీయ రహదారిపై నడిచి వెళుతుండగా వెనుకవైపు నుండి గుర్తు తెలియని కారు ఢీకొని వెళ్ళిపోయినట్లు స్థానికుల సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్.ఐ జంపాని కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.