*నెల్లూరు కేంద్రంలో ఐసోలేషన్ బెడ్లు ఖాళీ లేవా...? వింజమూరులోనే పాజిటివ్ సోకిన యువకుడు....భయాందోళన చెందుతున్న ప్రజలు....అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు..... వింజమూరు, జూలై 13 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ నియంత్రణ విషయంలో నిరంతరం కృషి చేస్తున్నామని పదే పదే ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతున్నది. సాక్షాత్తూ కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని నెల్లూరులోని ఐసోలేషన్ కేంద్రంలో ఉంచకుండా వింజమూరులో బాధితుడి స్వగృహానికే తరలించి సంబంధిత అధికారులు తమ రాజనీతిని చాటుకున్న వైనమిది. అధికారుల తీరు పట్ల ప్రజలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వివరాలలోకి వెళితే గతంలో పలు మండలాలలో ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం నిర్వహించిన మాజీ అధికారి కుమారుడు ఇతర రాష్ట్రం నుండి వస్తుండగా అతనికి విజయవాడలో అక్కడి అధికారులు కరోనా టెస్టులు నిర్వహించినట్లు సమాచారం. అయితే రిపోర్టులలో సదరు యువకుడికి కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ జరిగింది. వింజమూరులో ఉన్న ఆ యువకుడిని వెంటనే జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఇక్కడి అధికారులు ఏం చేశారో తెలుసా.... అంబులెన్సులో పాజిటివ్ సోకిన వ్యక్తిని నెల్లూరుకు తరలించి అక్కడ ఐసోలేషన్ వార్డులు ఖాళీ లేవని, బెడ్లు లేవని తిరిగి వింజమూరులోని స్వగృహానికి బాధితుడిని తరలించారు. ఈ పరిణామంతో స్థానిక ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. సంబంధిత అధికారుల వ్యవహారశైలిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం ఉంటే నానా హడావిడి చేసి బాధితులను ఆసుపత్రులకు తరలిస్తున్న అధికారులు ఏకంగా కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని ఇంట్లోనే ఉంచడంలో ఆంతర్యమే


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం