*ఏ.బి.వి.పి నేతల నిరసన దీక్షలు * వింజమూరు,జులై 5, (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు వింజమూరు ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని విద్యా శాఖ మంత్రి మరియు విద్యాశాఖ అధికారులకు నిరసన దీక్ష ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా మహేంద్ర వింజమూరు నగర అధ్యక్షులు ద్వారా వెంకటేశ్వర్లు నగర కార్యదర్శి ఉదయ్ కిరణ్ కార్యకర్తలు చాంద్ కొవిడ్ -19 దృష్టిలో పెట్టుకుని వారి నివాసంలోనే నిరసన దీక్ష చేపట్టారు.