: *ఓటు విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టడం న్యాయమా...!* వింజమూరు, జూలై 6 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ఓట్లు విచారణ పేరుతో అధికారులు ఇబ్బందులు పెట్టడం న్యాయమా అని మండలంలోని చాకలికొండ పంచాయితీ పరిధిలోని పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో అధికారుల నోటీసులకు వివరణ ఇచ్చేందుకు దూర ప్రాంతాల నుండి వచ్చామని, చివరికి వాయిదా వేయడంతో మా పరిస్థితి ఏంటని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. వివరాలలోకి వెళితే చాకలికొండ పంచాయితీ పరిధిలోని చాకలికొండ, గోళ్ళవారిపల్లి, బత్తినవారిపల్లి, పోలినాయుడుపల్లి గ్రామాలకు చెందిన పలువురు స్థానికంగా ఉండటం లేదని, వారి ఓట్లును తొలగించాలని ఆయా గ్రామాలకు చెందిన పలువురు ఫారం-7 ద్వారా ఫిర్యాదు చేశారు. వీటిపై తహసిల్ధారు దాదాపుగా 231 మందికి నోటీసులు జారీ చేయడంతో పాటు ఈ నెల 6 వ తేదీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొంతమంది ఆదివారం సాయంత్రం నాటికి స్వగ్రామాలకు చేరుకున్నారు. అయితే ఆదివారం సాయంత్రం 6 వ తేదీ నిర్వహించనున్న విచారణను వాయిదా వేస్తున్నామని అధికారులు ప్రకటించారు. దీంతో ఖంగుతిన్న గ్రామస్థులు తహసిల్ధారు వద్దకు చేరుకుని ఈ సమయంలో ఇబ్బందులు పెడితే ఎలాగని ప్రశ్నించారు. గిట్టనివారు రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాలపై తాము న్యాయస్థానాలను ఆశ్రయించనున్నామని స్పష్టం చేశారు. ఇలాంటి కక్ష్యపూరిత విధానాలు పచ్చనిపల్లెల్లో విష సంస్కృతికి బీజాలు వేసే ప్రమాదం ఉందని, ఇది మంచి పద్ధతి కాదని హితువు పలికారు. ఈ విషయాలన్నింటిపై తాము కోర్టుకు వెళతామని తేల్చి చెప్పారు. ప్రజల చేత శెభాష్ అనిపించుకుని ఎన్నికలలో ప్రజాదరణ పొందాలే తప్ప దొడ్డిదారిలో ప్రతిపక్ష ఓటర్లును తొలగించి గెలవాలనుకోవడం సిగ్గులేని చర్యగా అభివర్ణించారు. కోవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి తమను విచారణ పేరుతో స్వగ్రామాలకు పిలిపించి విచారణను వాయిదా వేయడం, మరలా రావాలని అధికారులు చెప్పడంలో ఆంతర్యమేమిటని వారు ఆవేదన చెందారు. జీవనభృతి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళామని, ఓట్లు తొలగించాలని చూడటం దారుణమన్నారు. ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు న్యాయ నిపుణుల సలహాలతో ముందుకు సాగుతామని గ్రామస్థులు తెలియజేశారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image