*వింజమూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* డాక్టర్..హరిక్రిష్ణ.... వింజమూరు, ఆగష్టు 23 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైధ్యాధికారి డాక్టర్ హరిక్రిష్ణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు 212 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. వైరస్ బారిన పడిన 72 మంది కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ కాగా 96 మంది హోం ఐసోలేషన్లలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఆత్మకూరు, నెల్లూరు క్వారంటైన్ కేంద్రాలలో 30 మంది, జి.జి.హెచ్ నందు 7 మంది వైద్య చికిత్సలు పొందుతున్నారని తెలిపారు. మండలంలో 7 మంది కరోనా వైరస్ బారిన పడి మరణించడం జరిగిందన్నారు. గత 3 రోజుల క్రితం సంజీవిని బస్ ద్వారా నిర్వహించిన పరీక్షల రిజల్ట్స్ రావల్సి ఉందన్నారు. నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కొలది కేసులు పెరుగుతున్నందున ప్రజలు తప్పనిసరిగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం సూచిస్తున్న సలహాలు, సూచనలను పాటించి ఎవరికి వారు కరోనా మహమ్మారి బారిన పడకుండా స్వీయ నిర్భంధంలో ఉండాలని, అత్యవసర పరిస్థుతులలో బయటకు వస్తే మాస్కులు ధరించాలని కోరారు.