*కలిగిరిలో ఇసుక టిప్పర్ ల హోరు...* ఉదయగిరి, సెప్టెంబరు 12 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో స్థానిక రెవెన్యూ ఆఫీస్ సెంటర్ లోని ప్రజలు ఇసుక టిప్పర్ ల హోరు కు భయంతో బెంబేలెత్తి పోతున్నారు. సంగం మరియు బుచ్చి నుంచి కావలి పరిసర ప్రాంతాల కు పోయె ఇసుక టిప్పర్ లు హైవే నుంచి పోకుండా టోల్ గేట్ లు తప్పించుకుంటూ కలిగిరి నుంచి కావలి కి వెళ్తూ ఉండటంతో ఈ మార్గంలోని రోడ్లన్నీ గుంతలు పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పది పన్నెండు టన్నులు ఇసుక అని చెబుతూ 25 నుంచి ముప్పై టన్నుల వరకు ఇసుక టిప్పర్లు రోజుకీ యాభై వరకు ఈ మార్గంలో వస్తుండటంతో అటు ప్రయాణికులు ఇటు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విధంగా ఈ టిప్పర్లు ఈ మార్గం లో వస్తుంటే రానున్న వర్షా కాలంలో ఈ మార్గంలోని రోడ్లు పూర్తిగా గుంతలు పడి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని మండల ప్రజలు భయాందోళనలు చెందు తున్నారు.
Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
• Valluru Prasad Kumar
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
• Valluru Prasad Kumar
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన
• Valluru Prasad Kumar
పోలీసు శాఖ కు కిమ్స్ విరాళం
• Valluru Prasad Kumar
సెంట్రల్ లైటింగ్ సిస్టం ప్రారంభం
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn