*బి.జె.పి, జనసేన ల అధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం* వింజమూరు, సెప్టెంబర్ 20 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): భారత ప్రధాని నరేంద్రమోదీ 70 వ జన్మదినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ, జనసే న పార్టీల నేతలు వింజమూరులో మెగా రక్తదాన శిబిరమును నిర్వహించారు. స్థానిక శ్రీ వివేకానంద జూనియర్ కళాశాలలో పులిచర్ల.నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో జరిగిన ఈ మెగా రక్తదాన శిబిరంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాన శిబిరమును బి.జె.పి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కాకు. విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగిస్తూ వింజమూరులో పులిచర్ల.నాగిరెడ్డి ట్రస్ట్ నేతృత్వంలో ట్రస్ట్ చైర్మన్, మాజీ జడ్.పి.టి.సి సభ్యులు పులిచర్ల.వెంకట నారాయణరెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్ధారు యం.వి.కే.సుధాకర్ రావు, ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బంకా.శ్రీనివాసులురెడ్డి, పులిచర్ల.నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పులిచర్ల.వెంకటనారాయణరెడ్డి, బి.జె.పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బయ్యపురెడ్డి.కేశవులురెడ్డి, బి.జె.పి జిల్లా ఉపాధ్యక్షులు యల్లాల.రఘురామిరెడ్డి, మండల జనసే న పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు, బి.జె.పి మండల శాఖ అధ్యక్షులు బయ్యపురెడ్డి.రవిశంకర్ రెడ్డి, శ్రీ వివేకానంద విద్యాసంస్థల కరస్పాండెంట్ మద్దూరి.గోపాల్ రెడ్డి, కే.జి.ఆర్.వి.ఎస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కొండా.వెంకట ప్రసాద్, కొండా.బాలసుబ్రహ్మణ్యం, దుగ్గి.మధులు, గో సం రక్షణ విభాగ్ ఆర్.వి.క్రిష్ణారెడ్డి, బి.జె.పి మాజీ మండల కన్వీనర్ గున్నం.ప్రసాద్ రెడ్డి, బి.జె.పి నేతలు మద్దూరి.నాగేశ్వరరావు, మూలా.బాలక్రిష్ణారెడ్డి, మల్లం.కొండారెడ్డి, ఏ.బి.వి.పి విధ్యార్ధి సంఘం నేత ఆకిలి.రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
దసరా సెలవుల్లో.. రైళ్లు.. ఫుల్‌
చాలా మంది త్వరలో వస్తారు... వారెవరో అప్పుడు మీరే చూస్తారు
టీడీపీ కొత్త కార్యాలయం త్రీడీ నమూనా విడుదల చేసిన చంద్రబాబు
Image