*ఫ్యాక్షన్ తరహాలో బత్తాయి తోట ఫెన్సింగ్ రాళ్ళు ధ్వంసం* ఉదయగిరి, సెప్టెంబర్ 6 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఫ్యాక్షన్ తరహాలో తోటల విధ్వంసం, శిలా ఫలకాలు ధ్వంసం లాంటి సంఘటనలు ఇటీవల ఉదయగిరి ప్రాంతంలో పెచ్చురిల్లుతున్నాయి. ఈ విష సంస్కృతులు ఎటు దారి తీస్తాయనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. వివరాలలోకి వెళితే తాజాగా నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం క్రిష్ణగాంధీపురం గ్రామంలో కొండూరు. సుబ్బమ్మ అనే మహిళా రైతుకు చెందిన బత్తాయి తోట చుట్టూ వేసి ఉన్న 41 ఫెన్సింగ్ రాళ్ళును అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రైతు కొండూరు. సుబ్బమ్మ దంపతులు బెంగుళూరుకు వెళ్ళి ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఈ నెల 3 వ తేదీ రాత్రి బత్తాయి తోటకు రక్షణగా వేసిన ఫెన్సింగ్ రాళ్ళును గుర్తు తెలియని వ్యక్తులు విరగ్గొట్టారని అన్నారు. 4 వ తేదీ ఉదయం యధావిధిగా తమ తోటలోకి పశువుల గడ్డి కోసుకునేందుకు వెళ్ళిన కొంతమంది గ్రామస్థులు బెంగుళూరులో ఉన్న తమకు తోటలో జరిగిన విధ్వంసం గురించి తెలియజేశారన్నారు. వెంటనే హుటాహుటిన తాము స్వగ్రామానికి చేరుకుని తోటను పరిశీలించి మనోవ్యధకు గురయ్యామని సుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విష సంస్కృతులు మంచి పద్దతి కాదని ఆమె ఈ దుశ్చర్యలకు పాల్బడిన వారికి హితువు పలికారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తోటలో ఫెన్సింగ్ రాళ్ళు ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించి భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.


Popular posts
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
21వ శతాబ్దం మనదే...మోదీ
Image
బాలల దినోత్సవ సందర్భంగా    వాసవి క్లబ్    ఆధ్వర్యంలో.నోట్ బుక్స్ పంపిణీ..
Image
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*