పాత్రికేయ వృత్తిని గౌర‌వించుకుందాం... * ఉత్త‌మ పాత్రికేయుల‌కు స‌త్కారం * విద్యాధ‌ర‌పురం వాస‌వీ క్ల‌బ్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పేర్ల శ్యామ్‌కుమార్ విజ‌య‌వాడ‌‌: పౌర స‌మాజంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను సాహ‌సోపేతంగా వెలికితీస్తున్న పాత్రికేయ వృత్తిని గౌర‌వించ‌డం పౌర స‌మాజం ప్ర‌ధాన బాధ్య‌త అని వాస‌వీ క్ల‌బ్ ఆఫ్ విద్యాధ‌ర‌పురం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పేర్ల శ్యామ్‌కుమార్ అన్నారు. వాస‌వీ క్ల‌బ్ ఇంట‌ర్నేష‌న‌ల్ వ్య‌వ‌స్థాప‌కులు కేసీ గుప్తా జ‌యంతి సంద‌ర్భంగా ఏటా సెప్టెంబ‌రు 6న జ‌ర్న‌లిస్ట్ డే గా జ‌రుపుకోవడం ఆన‌వాయితీగా వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా వారోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న విద్యాధ‌ర‌పురం వాస‌వీ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో జ‌ర్న‌లిస్ట్ డే ను పుర‌స్క‌రించుకుని ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి న‌డుమ వార‌ధిగా ప‌నిచేస్తున్న ప‌లువురు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులనుకు ఆదివారం గుప్తా సెంట‌ర్‌లోని క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రీ స‌త్రంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఘ‌నంగా స‌త్క‌రించారు. అనంత‌రం విద్యాధ‌ర‌పురం వాస‌వీ క్ల‌బ్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పేర్ల శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ నిత్యం స‌మాజంలో అంద‌రి సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తున్న జ‌ర్న‌లిస్టుల సేవ‌లు మ‌రువ‌లేనివ‌న్నారు. మునుపెన్న‌డూ చూడ‌ని క‌రోనా వంటి విప‌త్తు స‌మ‌యంలో కూడా ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా అంకిత‌భావంతో విధులు నిర్వ‌హిస్తున్న జ‌ర్న‌లిస్టుల‌ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదుకోవాల‌ని కోరారు. ముఖ్యంగా ఈ స‌మ‌యంలో సేవ‌లందిస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల‌‌తో పాటు జ‌ర్న‌లిస్టుల‌ను కూడా క‌రోనా వారియర్స్‌గా గుర్తించి రూ.50 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమాను వ‌ర్తింప‌జేయాల‌ని ప్ర‌భుత్వాల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా వాస‌వీ క్ల‌బ్ విద్యాధ‌ర‌పురం ఆధ్వ‌ర్యంలో రెండు ద‌శాబ్ధాల‌కు పైబ‌డి జ‌ర్న‌లిజం విలువ‌లుకు క‌ట్టుబ‌డి ప‌నిచేస్తున్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ట్ కొంకిమ‌ళ్ళ శంక‌ర్‌, డెక్క‌న్ క్రానిక‌ల్ సీనియ‌ర్ ఫొటో జ‌ర్న‌లిస్ట్ ‌సీహెచ్ నారాయ‌ణ‌రావు, ఆంధ్ర‌ప‌త్రిక సీఈవో వ‌ల్ల‌భ‌దాసు మాధ‌వ‌రావు, హ‌న్స్ ఇండియా ఫొటొ జ‌ర్న‌లిస్ట్ మ‌స్తాన్‌, ఇండియా టీవీ ప్ర‌తినిధి దేసు మోహ‌న్‌కుమార్‌ల‌ను శాలువా క‌ప్పి ఘ‌నంగా స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో క్ల‌బ్‌ కోశాధికారి కోట న‌ర‌సింహ‌రావు, స‌భ్యులు ఆల‌మూరి ఉపేంద్ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.