*నేడు యం.యల్.ఏ మేకపాటి చే సచివాలయాలు ప్రారంభం* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో నేడు సోమవారం ఉదయం నూతన సచివాలయ భవనాలకు ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి. చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేయనున్నారని మండల వై.సి.పి కన్వీనర్ తిప్పిరెడ్డి నారపరెడ్డి, మండల వై.సి.పి యం.పి.పి అభ్యర్ధి పల్లాల.కొండారెడ్డి, మద్దురి. చిన్నికృష్ణ రెడ్డి, బోర్ వెల్స్ రాజా, యువజన నాయకుడు పోరెడ్డి జగన్, కాటేపల్లి, చాకలికొండ గ్రామాల నేతలు బండి క్రిష్ణారెడ్డి, మండాది గోవిందరెడ్డి, జక్కం.మోహన్ రెడ్డి, పోలుబోయిన వెంకటేశ్వర్లులు, మబ్బు.ప్రసాద్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పధకాలను ప్రజల ఇంటి వద్దకే చేర్చే లక్ష్యాలలో భాగంగా యువ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇందులో భాగంగా దాదాపుగా 40 లక్షల రూపాయల వ్యయంతో కొత్త భవానాలు నిర్మించడం జరుగుతుందన్నారు. కాటేపల్లి గ్రామంలో ఉదయం 9 గంటలకు, చాకలికొండలో ఉదయం 10 గంటలకు నూతన సచివాలయ భవనాలను యం.యల్.ఏ మేకపాటి. చంద్రశేఖర్ రెడ్డి లాంచనంగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. కనుక ఈ కార్యక్రమాలకు వై.సి.పి నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం