మాజీ మంత్రి పీతల సుజాత తండ్రి  వర ప్రసాద్ మృతి


 మాజీ మంత్రి శ్రీమతి పీతల సుజాత తండ్రి శ్రీ  వర ప్రసాద్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సుజాత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. "జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా పశ్చిమ గోదావరిలో టిడిపి బలోపేతానికి వర ప్రసాద్ విశేషంగా కృషి చేశారు. దళితుల అభ్యున్నతి కోసం వర ప్రసాద్ చేసిన సేవలు ప్రశంసనీయం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ముందు ఉండే వారు. వర ప్రసాద్ మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు" గా పేర్కొన్నారు.