పల్నాడులో 144 సెక్షన్‌

అమరావతి: 


పల్నాడులో 144 సెక్షన్‌ విధించామని డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. 


శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.


 'చలో ఆత్మకూరు' కోసం తమను అనుమతి కోరలేదని, కోరితే పరిశీలిస్తామని చెప్పారు. 


పల్నాడు ప్రాంతంలో బయట నుంచి వచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చేపట్టే ఊరేగింపులకు అనుమతులు ఇవ్వబోమని స్పష్టంచేశారు. 


వివేకానందరెడ్డి హత్య కేసులో శ్రీనివాసరెడ్డిని పోలీసులు విచారించలేదని, వేరే నిందితుడితోపాటు వచ్చారని, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియదని, దీంతో పోలీసులకు సంబంధంలేదని చెప్పారు. 


సమావేశంలో ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌, గుంటూరు అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు పీహెచ్‌డీ రామకృష్ణ, జయలక్ష్మి పాల్గొన్నారు.