వారి కోసమే బీజేపీలో చేరుతున్నా: ఆదినారాయణరెడ్డి

వారి కోసమే బీజేపీలో చేరుతున్నా: ఆదినారాయణరెడ్డి
ఢిల్లీ: బీజేపీలో చేరుతున్న విషయాన్ని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. నేడు ఆయన మాట్లాడుతూ స్థానిక పరిస్థితుల కారణంగానే బీజేపీలోకి వెళ్తున్నానన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు తెలిపానన్నారు. టీడీపీతో విభేదాలు లేవని, తన అనుచరుల కోసమే బీజేపీలోకి వెళ్తున్నానన్నారు. జగన్‌ దాష్టీకాలను ఎదుర్కోవాలంటే బీజేపీలాంటి గట్టి పార్టీ అవసరమని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. జగన్‌ అరాచకాలు రోజుకురోజుకు పెచ్చుమీరుతున్నాయన్నారు. ఏపీలో బీజేపీ బలపడుతుందన్న నమ్మకం ఉందన్నారు. అయితే అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరాలా? లేదంటే నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి చేరాలా? అనేది ఇవాళ నిర్ణయిస్తామని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.