జ్యోతి సురేఖ ధైర్య సాహసాలు అభినందనీయం..: గవర్నర్

జ్యోతి సురేఖ ధైర్య సాహసాలు అభినందనీయం...
* గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్
ఏపి రాజ్‌భ‌వ‌న్‌: జ్యోతి సురేఖ పిన్న వయస్సులోనే విలువిద్య క్రీడలో అనితర సాధ్యమైన విజయాలను అందుకుని రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకువచ్చారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. సురేఖ సాధించిన విజయాలు చిన్నవి కావని దేశం మొత్తం గర్విస్తుందని గవర్నర్ తెలిపారు. విలువిద్య ఛాపింయన్, అర్జున అవార్డు గ్రహీత వెన్నమ్ జ్యోతి సురేఖను రాజ్ భవన్ వేదికగా శనివారం గవర్నర్ సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ 4 సంవత్సరాల 11 నెలల చిన్న వయస్సులోనే కృష్ణా నదిలో 5 కిలోమీటర్ల దూరం ఈత కొట్టిన సురేఖ అతి పిన్న వయస్సు స్విమ్మర్‌గా ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నారన్నారు. అత్యంత  ధైర్యసాహసాహలతో కూడుకున్న ఈ రికార్డు  సాధించిన  జ్యోతి సురేఖ అభినందనీయిరాలని గవర్నర్ పేర్కొన్నారు. నెదర్లాండ్‌లో జరిగిన 50వ ప్రపంచ విలువిద్య ఛాంపియన్‌షిప్ 2019లో కాంస్య పతకం సాధించిన  నేపధ్యంలో జ్యోతి సురేఖను గవర్నర్ హరిచందన్ రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సన్మానించారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలను అందుకుని దేశ ప్రతిష్టను ఇనుమడింపచేయాలని గవర్నర్ అకాంక్షించారు. కార్యక్రమంలో రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి అర్జునరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ సభ్యులు ప‌లువురు పాల్గొన్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image