మహిళా శిశుసంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష

09–09–2019
అమరావతి


అమరావతి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మహిళా శిశుసంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ సమీక్ష


*ఏ విధానమైనా లబ్ధిదారులకు పథకాన్ని నిరాకరించడానికి కాదు*


సంక్షేమ పథకాల అమల్లో అధికారులకు సీఎం మార్గ నిర్దేశం
సంక్షేమ పథకాల అమల్లో అనుసరిస్తున్న విధానాలు పథకాలను నిరాకరించేలా ఉండకూడదని స్పష్టంచేసిన సీఎం
పథకాలు సంతృప్తికర స్థాయిలో లబ్ధిదారులకు అందించడానికే ఈ విధానాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్న సీఎం
అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు ఏవైనా లబ్ధిదారుడికి నో చెప్పడానికి కాదు
బయోమెట్రిక్‌ లేదా ఐరిస్‌ లేదా వీడియో స్క్రీనింగ్‌ ఇవన్నీ ఆ పథకం లబ్ధిదారుడికి చేరిందనే దానికి ఆధారం తప్ప, ఏ స్కీంనైనా నిరాకరించడానికి కాదని స్పష్టంచేసిన సీఎం


*గ్రామ సచివాలయాల్లో ఒక హెల్ప్‌లైన్‌*
గ్రామ సచివాలయాల నుంచి నుంచి వస్తున్న అత్యవసర విషయాలపై ప్రభుత్వం, యంత్రాంగం స్పందించడానికి ప్రత్యేక మెకానిజం ఉండాలన్న సీఎం
గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల సహకారాన్ని మహిళ సంక్షేమంలో తీసుకోవాలన్న సీఎం
ప్రతి గ్రామ సెక్రటేరియట్‌లో ఒక హెల్ప్‌ లైన్‌ ఉంచాలన్న సీఎం
1008 కేసుల్లో వేధింపులకు గురైన మహిళలకు ఇవ్వాల్సిన పరిహారం రూ.7.48 కోట్లను గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వచ్చిన అధికారులు
వెంటనే విడుదలచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
ఇదే సమయంలో వివిధ ఘటనల్లో బాధితులకు సహాయం చేయడానికి ఒక్కో జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయల చొప్పన నిధిని కేటాయించాలన్న సీఎం
నిధి ఖర్చు అవుతున్న కొద్దీ... కోటి రూపాయలకు తగ్గకుండా నిల్వ ఉండేలా వారంరోజుల్లో మళ్లీ మంజూరుచేయాలన్న సీఎం
దీనిపై ఒక విధానం తీసుకురావాలన్న సీఎం
బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన కల్పించాలన్న సీఎం, తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం


*గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై ఆరా*
గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అంశంపై ఇప్పుడున్న పరిస్థితి ఏంటో తనకు తెలియజేయాలన్న సీఎం
భూ వివాదాలు, ఇతరత్రా వివాదాలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలన్న సీఎం
వీటిని దశాబ్దాల తరబడి నాన్చి న్యాయం జరగని పరిస్థితి ఉండకూడదన్న సీఎం
గ్రామ న్యాయాలయాలపై తనకు వివరాలు తెలియజేయాలన్న సీఎం


*స్కూళ్లలో చేరని విద్యార్థులపై దృష్టి*
అంగన్‌వాడీల నుంచి స్కూళ్లలో చేరని పిల్లలను వెంటనే గుర్తించండి
వారిని వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని విజ్ఞప్తి
దాదాపు ఏడువేల మంది అంగన్‌వాడీల నుంచి స్కూళ్లలో చేరలేదని గుర్తించిన అధికారులు
ఆరునెలలపాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి తర్వాత వారి సామర్థ్యాలనుబట్టి ఆయా తరగతుల్లో చేర్పించాలన్న సీఎం
మిగతా పిల్లలతో సమానంగా రాణించేలా తగిన శ్రద్ధ పెట్టాలన్న సీఎం


*మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి*
మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉందన్న అధికారులు 
టెస్ట్‌ – ట్రీట్‌ – టాక్‌విధానంలో ఈ రక్త హీనతను అధిగమించే చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు
రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించడంతో పాటు రక్తహీనత రాకుండా  తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్లు సీఎంకి వివరించిన అధికారులు 
వయసుకు తగ్గ బరువులేని వాళ్లు 17.2 శాతం
వయసుకు తగ్గ ఎత్తు లేనివాళ్లు 30.2 శాతం


*గర్భవతులకు ఆహారంగా ఏం ఇస్తున్నారో అడిగితెలుసుకున్న సీఎం*
రోజుకు రూ.22.5లు ఖర్చుచేస్తున్నామన్న అధికారులు
ఏయే సరుకులకు ఎంత ఖర్చుచేస్తున్నారని విడిగా వివరాలు రూపొందించాలన్న సీఎం
మరింత నాణ్యంగా, పౌష్టికరమైన ఆహారాన్ని అందించడంపై దృష్టిపెట్టాలన్న సీఎం
ఇచ్చేది ఏదైనా పరిశుభ్రమైన, పౌష్టికాహారాన్ని అందించాలన్న సీఎం
అందుకు ఎలాంటి పద్దతులు, విధానాలు అందించాలో ఆలోచన చేయాలన్న సీఎం, దీనిపై తగిన ఆలోచనలు చేసి నివేదిక ఇవ్వాలన్న సీఎం


మహిళా, శిశు సంక్షేమంలో గ్రామవాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించండి
శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం
వయసుకు తగ్గ బరువు, ఎత్తు ఉన్నారా? లేదా? అన్నదానిపై వివరాలు ఎప్పటికప్పుడు నమోదుచేస్తామన్న అధికారులు
ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఇచ్చే ఆరోగ్యకార్డులను దీనికోసం వాడుకోవాలని, అందులో ఈ వివరాలు నమోదుచేయాలన్న సీఎం


అంగన్‌వాడీలపై ప్రత్యేక యాప్‌ తయారుచేయాలని సీఎం సూచన
పిల్లలకు అందుతున్న భోజనం, వారి సంరక్షణపై ఎప్పటికప్పుడు సమీక్షచేయాలన్న సీఎం
అంగన్‌వాడీ వర్కర్లను మోటివేట్‌ చేయాలన్న సీఎం


*స్కూళ్ల తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాల బాగు*


అంగన్‌ వాడీ భవనాల సెంటర్ల స్థితిగతులపై పూర్తినివేదిక సిద్ధంచేయాలని ఆదేశం
స్కూళ్లలో చేపడుతున్న నాడు – నేడు తరహాలో కార్యక్రమాలను చేపట్టడానికి ప్రణాళిక తయారుచేయాలన్న సీఎం
మూడేళ్లలో ఈపనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
ఎన్నారైలు, సంస్థలు, దాతల సహాయం తీసుకుందామన్న సీఎం
దీనికోసం పోర్టల్‌ రూపకల్పనకు ఇదివరకే ఆదేశాలు ఇచ్చానన్న సీఎం
ఎవరు సహాయం చేసినా వారి పేర్లు పెడతామన్న సీఎం
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై కార్పొరేటు, వివిధ ప్రైవేటు సంస్థలకు పూర్తి సమాచారం ఇవ్వాలన్న  సీఎం
సీఎస్‌ఆర్‌ ద్వారా వారి భాగస్వామ్యానికి అవకాశాలు కల్పించాలన్న సీఎం


మద్యానికి బానిసలైన వారి కోసం కౌన్సెలింగ్‌ సెంటర్ల ఏర్పాటు అంశంపై దృష్టిపెట్టాలన్న సీఎం
దీనిపై ఒక ప్రణాళిక సిద్ధంచేసి తనకు సమర్పించాలన్న సీఎం


దివ్యాంగుల విషయంలో ఉదారంగా ఉండాలని ఆదేశం
ఎలాంటి పరికరాలు కావాలన్నా అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image