ఈవో రఘురాం మృతిపట్ల  సంతాపం,

17 - 9 - 2019
విజయవాడ


దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు


బోటు ప్రమాద ఘటనలో దేవదాయశాఖ ఈవో రఘురాం మృతిపట్ల  సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు...


పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం అమరేశ్వర  ఆలయంలో గ్రేడ్ టు ఈవోగా పనిచేస్తున్న రఘురాం (40) బోటు ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు...


విషయం తెలిసిన  దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫోన్లో రఘురాం భార్య నాగజ్యోతి నీ పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు 


పాపికొండలు ఘటన చాలా బాధాకరమన్నారు.


కారుణ్య నియామకం కింద నాగజ్యోతికి  దేవాదాయ శాఖలో ఉద్యోగం కల్పిస్తామని భరోసానిచ్చారు..