ఉన్నత విద్యా కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ ఈశ్వరయ్య ?

ఉన్నత విద్యా కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ ఈశ్వరయ్య ?
త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం
అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచ డంతో పాటు మౌలిక సదుపా యాల కల్పన, ఫీజుల నియంత్రణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య నియమితులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించిన మీదట, రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ ఈశ్వరయ్యను కమిషన్‌ చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ కమిషన్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ ఐఏఎస్‌ అధికారి, ఉన్నత విద్యాసంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి ఈ కమిషన్‌కు సీఈవోగా వ్యవహరిస్తారు.  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఉన్నత విద్యా రంగంలో ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టారు. దీనికి అనుగుణంగానే ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ కమిషన్‌ పరిధిలోకి జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ కాలేజీలు, ప్రైవేట్, డీమ్డ్‌ యూనివర్సిటీలు వస్తాయి. ప్రవేశాలు, ఫీజులు, బోధన, పరీక్షలు, పరిశోధన, సిబ్బంది అర్హతలు, నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా? తదితర అంశాలన్నిటినీ ఈ కమిషన్‌ పర్యవేక్షిస్తుంది. ఈ కమిషన్‌కు సివిల్‌ కోర్టుకు ఉండే అధికారులు ఉంటాయి. ప్రమాణాలు, నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలకు ఆదేశాలిస్తుంది. అలాగే గుర్తింపు రద్దునకు సైతం ఆదేశాలు జారీ చేస్తుంది. పరిస్థితిని బట్టి జరిమానాలు కూడా విధిస్తుంది.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image