తన నివాసంలో టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ. చలో ఆత్మకూరు ఆందోళనల దరిమిలా పరిణామాలపై చర్చ. వందలాది టిడిపి నేతలపై కేసుల పట్ల ఆందోళన. ఈరోజు డిజిపికి టిడిపి నేతల బృందం ఫిర్యాదు చేయాలని నిన్న నిర్ణయం. నిన్ననే నాలుగు చోట్ల దాడులు, దౌర్జన్యాలు జరగడంపై టిడిపి నేతల ఆందోళన. ఈరోజు డిజిపిని కలుస్తుంటే నిన్న మళ్ళీ దాడులా ..? పోలీసుల నిస్సహాయతకు ఇది పరాకాష్ట..బాధితుల బాధలు ప్రసారం చేసిన వార్తా చానళ్లను బంద్ చేయడం ఏమిటి..? టివి 5 , ఏబీఎన్ ప్రసారాలను నిలిపేయాలని మంత్రులే బెదిరించడమా..? ప్రసార మాధ్యమాల గొంతు నొక్కేస్తారా..? అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేయాలని చూసారు. ఇప్పుడు టివి ఛానళ్ల గొంతు నొక్కేస్తున్నారు. ఛానళ్ల ఎంపిక వినియోగదారుల అభీష్టం. తమకే చానళ్ళు కావాలో వినియోగదారులే ఎంచుకుంటారు. దానికి ఒక నియంత్రణ వ్యవస్థ 'ట్రాయ్' వుంది. నచ్చిన చానళ్ళు ఇవ్వాలని ముందుగా ఎంఎస్ వో లను కోరాలి.
నివాసంలో టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ