కోడెల శివప్రసాద్ మృతికి ఐజేయూ, ఏపీయూడబ్లూజే ప్రగాఢ సంతాపం

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతికి ఐజేయూ, ఏపీయూడబ్లూజే ప్రగాఢ సంతాపం.


విజయవాడ: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆకస్మిక మృతిపట్ల ఐజేయూ, ఏపీయూడబ్లూజే నేతలు ఓ ప్రకటనలో తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాలలోకి ప్రవేశించిన ఆయన పలు కీలకమైన మంత్రి పదవులను పోషించి మంచి రాజకీయ వేత్తగా పేరుగడించారని తెలిపారు. సుదీర్ఘ రాజకీయాలలో ఆయన పోషించిన పాత్ర అమోఘమని పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని తెలియజేసిన వారిలో ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్, ఏపీయూడబ్లూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్దన్,విజయవాడ అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, చిన్న పత్రికల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లి ధర్మారావు, సీహెచ్ రమణారెడ్డి ఉన్నారు.  ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.