తేదీ.14.09.19
విజయవాడ.
స్టేడియం కు 6 కోట్లు విడుదల..
దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.
టిడిపి ప్రభుత్వ పాలనలో పశ్చిమ నియోజక వర్గ అభివృద్ది పైన పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
శనివారం నియోజక వర్గ పర్యటనలో బాగంగా 29 వ డివిజన్ లేబర్ కాలనీలో మంత్రి పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆయన మాట్లాడుతూ.. టిడిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల లో స్టేడియం నిర్మాణం కోసం శంకుస్థాపన పై మరో శంకుస్థాపన చెయ్యటం తప్ప నిర్మాణ పనులు చేపట్టలేదన్నారు. విజయవాడ నగరంలో మున్సిపల్ స్టేడియం తప్ప క్రీడల కోసం మరో స్టేడియం లేదని గాంధీ జి మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ పలు నిర్మాణాలతో కుచించుకు పోతుందన్నారు.ఈ తరుణంలో నియోజక వర్గ ప్రజల కోరిక మేరకు అరు కోట్ల రూ లతో స్టేడియం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో మిని క్రికెట్ స్టేడియం తో పాటు పలు క్రీడలకు సంబందించిన సదుపాయాలు ఎర్పాటు చెయ్యటం జరుగుతుందని అన్నారు. లేబర్ కాలనీ లో ఉన్న ఇళ్ళు మెయిన్ రోడ్ కన్న పల్లం గా ఉన్న కారణంగా వర్షపు నీరు, డ్రైన్ మురుగుతో పలు ఇబ్బందులు పడుతున్నామని వ్యాధులు సతాయిస్తున్నయని స్థానికులు మంత్రికి విన్నవించారు.ఈ ప్రాంతంలో నూతన గృహాల నిర్మాణానికి ప్రజలు సూత్ర ప్రాయం గా అంగీకరించారని దీనితో అధికారులు ప్రభుత్వం లేదా ప్రైవేట్ బాగ స్వామ్యం తో నూతన గృహాలు నిర్మించేందుకు ఉన్నవారికి గృహాలను కేటాయించటం తో పాటు చుట్టు ప్రక్కల గృహాలు లేని వారికి ఈ ప్రాంతంలో గృహాలు కేటాయించే విషయం పై సాద్యా సాద్యాలను చర్చించటం జరుగుతుందన్నారు. త్వరలో ప్రభుత్వం ఒక నిర్ణయం తో నూతన గృహ నిర్మాణాలు పనులు చేపడుతుందని తెలిపారు. ఈ పర్యటనలో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, క్రీడల మరియు జిల్లా అధికారులు పార్టీ నాయకులు డివిజన్ మాజీ కార్పొరేటర్ లు సంధ్యా రాణి, అప్పాజీ, మైలవరపు దుర్గారావు, కంది శ్రీనివాస రెడ్డి, కృష్ణ రెడ్డి, కోటిరెడ్డి, జిలానీ, పెద్ది రాజా రావు తదితరులు పాల్గొన్నారు.