హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దత్తాత్రేయకు హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా అవకాశం ఇచ్చింది. దీంతో నిన్న ఆ రాష్ట్ర రాజధాని సిమ్లా చేరుకున్న దత్తాత్రేయతో ఈరోజు అక్కడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతోపాటు తెలంగాణ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, పార్టీ నాయకులు చింతల రామచంద్రారెడ్డి, జితేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలియజేశారు.