కోడెల శివప్రసాద్ మరణం పట్ల దిగ్భ్రాంతి చెందాం

అమరావతి
16.9.2019


*రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ బొత్సా సత్యనారాయణ కామెంట్స్*


-  శివప్రసాద్ మరణం పట్ల దిగ్భ్రాంతి చెందాం. 
- ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాం. 
– శివప్రసాద్‌ గారి మరణంపై వార్తలు క్షణక్షణం మారుతూ వస్తున్నాయి. 
– కోడెల మృతికి గుండెపోటు కారణమంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. 
– మళ్ళీ వెంటనే గతరాత్రి ప్రమాదకరమైన ఇంజక్షన్‌ వేసుకున్నారని మరో వార్త ప్రసారం చేశారు. 
– ఆ వెంటనే ఆయన గుండెపోటుతో మరణించారని, వత్తిడితో మృతిచెందినట్లు మరో వార్త ప్రసారం చేశారు. 
– సీనియర్‌ రాజకీయ నాయకుడి మరణంపై పలు కథనాలు వస్తున్నప్పుడు వాటిపై సమగ్ర విచారణ జరగాలి.
– ఈ మేరకు తెలంగాణా ప్రభుత్వంను కోరుతున్నాము.
– సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని కోరుతున్నాం. 
– గుండెపోటు... ఇంజక్షన్‌... ఉరి వేసుకున్నారని అంటున్నారు... 
– ఏదైనా జరిగితే దగ్గరలోని ప్రముఖ ఆసుపత్రులు వున్నాయి. 
– వీటిని కాదని కోడెలను బసవ తారకం కాన్సర్‌ ఆసుత్రికి తీసుకువెళ్లడం పట్ల సందేహాలు వ్యక్తవుతున్నాయి. 
– తెలుగుదేశం పార్టీ నాయకులు కోడెల మరణంపై శవరాజకీయాలు చేస్తున్నారు. 
– ప్రభుత్వ వత్తిడి వల్లే ఉరివేసుకున్నారంటూ చెబుతున్నారు. 
– ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలి.
– ప్రభుత్వం కోడెలపై ఏనాడు వత్తిడి తేలేదు...కావాలని కేసులు పెట్టలేదు. 
– కోడెల శివప్రసాద్‌ వల్ల నష్టపోయిన వారు పోలీసులను ఆశ్రయించడం వల్లే కేసులు నమోదయ్యాయి. 
– దీనిని రాజకీయం చేయాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది. 
– సంఘటనా స్థలంను కస్టడీలోకి తీసుకుని, కోడెలకు పోస్టుమార్టం చేయడం ద్వారా వాస్తవాలను వెలికితీయాలి.