87-88 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల కలయిక

నెల్లూరు, వి.ఆర్.హై. స్కూల్, 1987 - 88 పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం సాయంత్రం చిల్డ్రెన్స్ పార్కు లో ఆత్మీయ కలయిక జరిగింది. పాత జ్ఞాపకాలను నెమరవేసుకుని ఒకరినొకరు మామా, బావా, ఒరేయ్,ఇంకొకరు ఇంకాస్త ముందుకు వెళ్లి వాడి స్టయిల్లో పలకరింపులు చేసుకున్నారు. ముందుగా మల్లికార్జున రెడ్డిశివ కుమార్ లు వచ్చారు, తరువాత జాబ్ consultency నిర్వాహకుడు ప్రసాద్, అంతిమ తీర్పు సంపాదకులు వల్లూరు ప్రసాద్,రవీంద్రభారతి స్కూల్ అకౌంట్స్ ఇంచార్జి          బి.జె.పి.బి.సి.నాయకులు శ్రీనివాసులు, రామమూర్తి, జైలు శాఖ ఉద్యోగి కామేశ్వరరావు, భాను, పెంచలయ్య, ప్లాట్లు వ్యాపారవేత్త వసంత్, సురేంద్ర,కొన్ని పేర్లు మిస్ అయినను, తదితరులు పాల్గొన్నారు. ప్రతి రెండు నెలకొకసారి ఇలా కలుసుకోవాలని అలాగే,ఎక్కడికీ అయినా టూర్ వెళ్లాలని, అలాగే అప్పటి హెడ్ మాస్టర్ నరసింహ రెడ్డి గారికి చిరు సత్కరించటం వంటి విషయాలు చర్చించినారు.