టీడీపీ అరాచకాలను ఆధారాలతో నిరూపిస్తాం : కాసు

టీడీపీ అరాచకాలను ఆధారాలతో నిరూపిస్తాం : కాసు
గుంటూరు : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిన 'ఛలో ఆత్మకూరు'ను విజయవంతం చేస్తామని చెప్పారు. బుధవారం ఉదయం 11 గంటలకు తాము ఆత్మకూరుకు చేరుకుంటామని తెలిపారు. చంద్రబాబు కథ తేలుస్తామని వ్యాఖ్యానించారు. అలాగే టీడీపీ నేతలతో ఇబ్బందులు పడిన తమ కార్యకర్తలు, ప్రజలతో కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు ఆత్మకూరు వెళ్లేందుకు పయనమవుతున్నారు. బుధవారం ఉదయం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ఆత్మకూరు బయలుదేరేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గందరగోళ పరిస్థితులు సృష్టించవద్దని వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు హితవు పలికారు.