టీడీపీ కార్యకర్తలను ఆదుకున్న నారా లోకేశ్
-కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి చెక్కులు అందజేసిన టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైద్యచికిత్సల కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ఆర్థికంగా చేయూతనందించారు. మంగళగిరి పట్టణానికి చెందిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి నారా లోకేశ్ మంజూరుచేసిన చెక్ లను టీడీపీ నేతలు అందజేశారు. శనివారం మంగళగిరి నియోజకవర్గ కార్యాలయం ఎం ఎస్ ఎస్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ కార్యకర్తలకు కష్టాలలో అండగా నిలిచిన నారా లోకేశ్ ని అభినందిస్తున్నానని అన్నారు. మంగళగిరి 11వ వార్డ్ కి చెందిన శివరామక్రిష్ణకి రూ.30 వేలు, 23వ వార్డుకు చెందిన చిలుముల సాంబశిరావుకి రూ.10 వేలు చెక్ లను వైద్యఖర్చుల కోసం అందజేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు మునగపాటి మారుతీ రావు అధ్యక్షతన జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, టీడీపీ సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, కొమ్మా లవకుమార్, ఎండీ ఇబ్రహీం, ఏఎంసీ మాజీ చైర్ పర్సన్ ఆరుద్ర భూలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు ఎండీ ఇక్బాల్ అహ్మద్, జంజనం వెంకట సాంబశివరావు, ప్రేమ్ కుమార్, విలియం, కార్యకర్తలు పాల్గొన్నారు.