ఐదుగురు ఉద్యోగులను తొలగించిన ఈవో

ఐదుగురు ఉద్యోగులను తొలగించిన ఈవో
చిత్తూరు : శ్రీకాళహస్తిలో ఐదుగురు ఉద్యోగులను ఈవో తొలగించారు. స్వామి దర్శనానికి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ వచ్చిన సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఉద్యోగిని ఈవో సస్పెండ్ చేశారు. నలుగురు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. శనివారం పుత్తూరు సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రశాంత జీవన విధానంపై శ్రీశ్రీ రవిశంకర్ ప్రసంగించారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్ ద్వారా రవిశంకర్ లక్షలాది మందిని ప్రభావితం చేశారు. పద్మవిభూషణ్‌ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ భావితరాలను ప్రభావితం చేస్తున్నారు.