జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం

జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
జాయింట్ కలెక్టర్-2 ఎం.వి. సూర్యకళ
  విశాఖపట్నం,అక్టోబరు,3ః జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపు విషయమై డి.ఎం.ఎ.సి. సమావేశం నిర్వహించినట్లు జాయింట్ కలెక్టర్-2 ఎం.వి. సూర్యకళ తెలిపారు.  గురువారం కలెక్టర్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్-2 చాంబర్ లో జర్నలిస్టుల అక్రిడిటేషన్ పొడిగింపుపై మీడియా అక్రిడిటేషన్లు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.  జిల్లా కలెక్టర్ ఆదేశాలపై జిల్లా జర్నలిస్టుల అక్రిడిటేషన్లు కమిటీ సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు.  అక్రిడిటేషన్లు అక్టోబరు నెల నుండి డిశంబరు నెల 31 వరకు పొడిగింపు విషయమై జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. అక్రిడిటేషన్లు గడువు సెప్టెంబరు 30 తో పూర్తి అయినదని,  అక్టోబరు 1 నుండి డిశంబరు 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు  అమలు విషయమై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో. సమాచార శాఖ ఉప సంచాలకులు డిఎంఎసి కన్వీనర్ వి. మణిరాం, డి.ఎం.ఎ.సి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, కె. చంద్రరావు, రవికాంత్, పి. సత్యనారాయణ, ఆర్.టి.సి. నుండి ఉదయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.