చిత్తూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ దగ్గర కంటైనర్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కంటైనర్ డివైడర్ ఢీకొని వాహనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందారు. కంటైనర్ కింద ఆటో, ఓమ్నీ వ్యాన్, బైక్ ఇరుక్కున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు గంగవరం మండలం మర్రిమాకులపల్లి వాసులుగా గుర్తించారు. మృతులు: రాము, రామచంద్ర, సావిత్రమ్మ, ప్రమీల, గుర్రమ్మ, నరేంద్ర, శేఖర్, పాపమ్మ.
చిత్తూరు జిల్లాలో కంటైనర్ బీభత్సం...12 మంది మృతి