అమరావతి
05.11.2019
*సచివాలయంలో మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పాయింట్లు...*
- గత రెండు మూడు రోజులుగా ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తున్నాయి.
- చంద్రబాబు అయిదేళ్లు సిఎంగా పనిచేశారు.
- సినిమాల్లో పాటలు విన్నట్లు.. 'అ' అంటే అమరావతి అని మాటలు చెప్పారు.
- చివరికి ఇండియా మ్యాప్ లో ఎపి రాజధాని ఎక్కడా కనిపించకుండా చేశాడు.
- తిరిగి సిఎం శ్రీ వైఎస్ జగన్ పైన వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు.
- చంద్రబాబు సిగ్గు, ఎగ్గు వదిలేశాడు.
- అయిదేళ్లు సిఎంగా చేసి రాష్ట్ర రాజధానికి కనీసం అడ్రస్ కూడా లేకుండా చేశాడు.
- 2 నెలల కిందటే రాష్ట్ర రాజధానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పాను...
- ఎపీ రాజధానికి కనీసం చిరునామా లేకపోవడం సిగ్గు చేటని ప్రశ్నించాను.
- రాష్ట్ర ప్రజలకు సొంత రాజధాని లేకుండా చేశారు.
- దీనిని ప్రశ్నించినందుకు నాపై చంద్రబాబు, ఆయన సహచరులు విమర్శలు చేశారు.
- బొత్స ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని ఆరోపణలు చేశారు.
- ఇప్పుడు కేంద్రం ఇచ్చిన మ్యాప్ లో ఎపి రాజధాని ఎందుకు లేదో సమాధానం చెప్పాలి.
- చంద్రబాబు తోకలుగా వున్న బిజెపి నేతలు దీనికి వంత పాడుతున్నారు.
- ఆనాడు కేంద్రమంత్రిగా వున్న సుజనా చౌదరి రాజధానిపై ఎందుకు శ్రద్ద తీసుకోలేదు?
- కేంద్రమంత్రిగా సుజనా, సిఎంగా చంద్రబాబు నిర్వాకం వల్లే ఈ పరిస్థితి.
- వారి అవినీతి, వ్యక్తిగత పోకడలు... దోపిడీ విధానాల వల్లే...
- ఎపి రాజధానికి కనీసం చిరునామా కూడా లేకుండా పోయింది.
- ఇసుక సమస్యలపై 14న దీక్ష చేస్తానని చంద్రబాబు అంటున్నారు.
- ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?
- దేశ వ్యాప్తంగా మంచి కార్యక్రమాలు చేపట్టే రోజునే ఇటువంటి దీక్షలు చేస్తారా?
- చంద్రబాబుకు భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడే అర్హత లేదు.
- వైఎస్‌ఆర్ హయాంలో ఎపిలో పెద్ద ఎత్తున గృహనిర్మాణ కార్యక్రమాలు చేశాం.
- ఉమ్మడి రాష్ట్రంలో సుమారు నలబై లక్షల ఇళ్లు నిర్మించాం.
- ఈ పదమూడు జిల్లాల్లో 25 లక్షల గృహాలు నిర్మించాం.
- 2003-04 మధ్యలో ఉపాధి లేక వసల పోయిన కూలీలకు పనులు కల్పించాం.
- వైఎస్‌ఆర్ హయాంలో ప్రతి ఒక్కరికీ పనులు దొరికాయి.
-సిఎంగా చంద్రబాబు అయిదేళ్ల పాలనలో పెద్ద ఎత్తున కూలీల వలసలు పెరిగాయి.
- బలహీనవర్గాల ఇళ్లకు బిల్లులు ఇవ్వవద్దని ఆనాడు చంద్రబాబు జీఓ ఇచ్చాడు.
- ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి.
- టిట్కో హౌసింగ్ పెట్టి కనీసం ఒక్క ఇల్లు అయినా చంద్రబాబు హయాంలో ఇచ్చారా?
- అంతకు ముందు మంజూరైన వాటిని పూర్తి చేసి... రెండు లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేశారు.
- ఇదీ భవన నిర్మాణ కార్మికుల పట్ల చంద్రబాబుకు వున్న ప్రేమ.
- దెయ్యాలు వేదాలు వల్లించినట్లు చంద్రబాబు భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడుతున్నారు.
- వరదలు వస్తాయని తెలిసి ఇసుకను స్టోరేజీ చేసుకోవాలని కొందరు చెబుతున్నారు.
- కానీ ఇది ఎవరు చేయాలి...? ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయ్యింది.?
- చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ...
- ఈ ప్రభుత్వం వల్లే ఇసుక సమస్య వచ్చిందని విమర్శిస్తున్నారు..
- మీ అయిదేళ్లలో ఒక్కరికి కూడా పని చూపించలేదు.
- మీ హయాంలో వలసలు జరిగే పరిస్థితి కల్పించారు.
- రాష్ట్ర రాజధానికి అడ్రస్ లేకుండా చేశారు.
- అవినీతితో రాష్ట్రంలో దోపిడీ చేసుకున్నారు.
- వాటిని ఈ ప్రభుత్వం సరిచేస్తుంటే... తప్పుడు ఆరోపణలు చేస్తారా?
- మీ అవకతవక విధానాలు... మీ వైఫల్యాల వల్లే ఈ సమస్యలు.
- వీటిని బూతద్దంలో చూపి... మాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
- రాష్ట్రానికి పదహారు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అబద్దాలు చెబుతారా?
- విశాఖలో జరిగిన ఎంఓయుల్లో కనీసం పేర్లు కూడా లేని కంపెనీలు వచ్చాయి.
- మా ప్రభుత్వం వాస్తవాలకు దగ్గరగా పనిచేస్తోంది.
- ఈ రాష్ట్రంకు ఏ విధంగాపెట్టుబడులు తీసుకురావాలి...
- నిరుద్యోగ సమస్యను ఏ రకంగా నిర్మూలించాలో మాకు తెలుసు.
- చంద్రబాబుతో కలిసి ఆయన మిత్రుడు పవన్ కూడా బయటకువస్తున్నారు.
- ఆయన నటుడు కావడంతో రాజకీయాల్లోనూ తన నటన ప్రదర్శిస్తున్నారు.
- రాజకీయాల్లో మాటలు కావు.. పని కావాలి.
- రాజకీయాల్లో 25 సంవత్సరాలు వుంటానంటూ...
- 25 నెలలకు ఒకసారి బయటకు వస్తున్నారు.
- వ్యక్తిగత అంశాలను కూడా రాజకీయంగా మాట్లాడుతున్నారు.
- రాజకీయాల్లో కొన్ని పద్దతులు, మర్యాదలు పాటించాలి.
- నిజంగా పవన్ కు ప్రజల్లో అంత శక్తే వుంటే..మీరే గత ఎన్నికల్లో గెలిచేవారు కాదా?
- 2014లో నేను ఓటమి పాలయ్యాను.. దానిని అంగీకరించాను.
- తరువాత వైఎస్‌ఆర్ సిపిలో చేరాను. వైఎస్ జగన్ నాయకత్వం అవసరమని చెప్పాను.
- ఆనాడు వున్న టిడిపి విధానాల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని చెప్పాను.
- చంద్రబాబు వల్ల రాష్ట్రం అన్యాయమైపోతోందని అన్నాను.
- వ్యవస్థలో మార్పు తేవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరమని చెప్పాను.
- వాస్తవాలను అంగీకరించకుండా.... మేమే గొప్ప అనుకుంటే ఎలా పవన్...?
- రాజకీయాల్లో వ్యక్తులు గొప్ప కాదు... ప్రజలకు బాధ్యత వహించాలి.
- ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ కు ఎక్కడా బాధ్యత లేదు.
- ఏదో సాధిద్దామని రాజకీయాల్లోకి వచ్చారు.
- మూడేళ్ల పాటు టిడిపి, బిజెపి ప్రభుత్వానికి అనుకూలం వుండి తరువాత విభేదించారు.
- రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలపై ఒక్కసారి అయినా గొంతెత్తి మాట్లాడారా...?
- సమస్యలపై మాట్లాడాలే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదు.
- పవన్ గడిచిన అయిదేళ్లలో భవన కార్మికుల గురించి ఒక్కసారైనా మాట్లాడారా...?
ఈ రోజు సమస్య వుంది... దీనిని అంగీకరిస్తున్నాం..
- ప్రకృతి వల్ల ఏర్పడిన ఇబ్బంది ఇది. కొద్దిరోజుల్లో దీనిని అధిగమిస్తాం...
- మేం పెట్టిన స్కీంను ఈ ప్రభుత్వం తీసేసిందని చంద్రబాబు బాధ.
- ఇసుక దోపిడీకి అవకాశం లేదనే ఆవేదన చంద్రబాబుది.
- ఆయన విధానాల వల్ల రాష్ట్రానికి నష్టం.. అందుకే ప్రజలు తిరస్కరించారు.
- చంద్రబాబులా మేం కూడా దోపిడీ చేయాలా...?
- ఆలీబాబా నలబై దొంగల్లా మేం కూడా పంచుకుని తినాలా?
- రూ. 2లక్షల కోట్లు విలువైన అమరావతి ఏర్పాటు చేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు.
- బంగారు బాతు అంటున్నాడు. కానీ ఇది అడ్రస్ లేని బాతు...
- అమరావతి తాత్కాలిక చిరునామా అని చంద్రబాబే చెప్పాడు.
- పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదులుకుని చంద్రబాబు పారిపోయి వచ్చాడు.
- చంద్రబాబుకు దూరదృష్టి లేకపోవడం... అవినీతికి పాల్పడటం..వల్లే ఈ పరిస్థితి వచ్చింది.
- రాజధానిపై నిపుణుల కమిటీ రాజధాని విషయంలో అధ్యయనం చేస్తోంది.
- ఈ రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమంను సిఎం శ్రీ వైఎస్ జగన్ సమన్వయం చేస్తున్నారు.
- చంద్రబాబు తన భాషను అదుపులో పెట్టుకోవాలి.
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు సమస్యలపై స్పందించండి.
- కానీ వ్యక్తిగత అంశాలపై విమర్శలు చేయడం సమంజసం కాదు.
- సవాళ్లు విసరడం... తాట తీస్తాననడం... పదిమందిని తీసుకువస్తామని చెప్పడం...సరికాదు.
- చంద్రబాబుకు ఎలాగూ రాజకీయ భవిష్యత్తు లేదు...
- పవన్ 25 ఏళ్లపాటు రాజకీయాల్లో వుంటానని చెప్పారు.
- మరో రెండు ఎలక్షన్ లు పవన్ చూడాల్సి వుంది.
- ఇప్పటికైనా ఆయన సంయమనంతో మాట్లాడాలి.
- ఇసుక కొరతకు సిమెంట్ కంపెనీల ముడుపులే కారణమని ఆరోపిస్తున్నారు.
- చంద్రబాబు మేధావితనం ఏమిటో అర్ధం కావడం లేదు.
- ఇసుక ఆపితే... సిమెంట్ కంపెనీలు ముడుపులు ఇస్తాయని అర్ధం లేని విమర్శలు చేస్తున్నాడు.
- ఉచితం పేరుతో టిడిపి కార్యకర్తలను, ప్రజాప్రతినిధులకు ఇసుకను దోచిపెట్టారు.
- మీ విధానాలను మేం ఎలా అమలు చేస్తాం చంద్రబాబు?
- సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలంటూ కొత్త నినాదంతో చంద్రబాబు దోపిడీ చేశారు.
- హుద్ హుద్ తుఫాన్ సందర్బంగా ఈ మాటలు చంద్రబాబు చెప్పారు.
- మేం ఇసుక సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలని అనుకోవడం లేదు.
- మీ హయాంలో జరిగిన దోపిడీని సరిదిద్దుతున్నాం.
- భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నాం.
- తాత్కాలికంగానే ఈ ఇబ్బందులు వున్నాయి.
- సిఎస్ బదిలీ పాలనా వ్యవహారాల్లో సాధారణ అంశం.
- ఉద్యోగులు, మంత్రులు పరిపాలనలో భాగంగా మారుతూ వుంటారు.
- భవన నిర్మాణ కార్మికులకు రూ.50వేలు పరిహారం అడుగుతున్నారు.
- ఇది ఇవ్వగలిగే మొత్తమేనా... గతంలో ఎప్పుడైనా ఇలా ఇచ్చారా?
- కార్మికులకు ఉపాధి చూపించేందుకు కొత్త పనులను మంజూరు చేస్తున్నాం.
- పంచాయతీ రాజ్ నుంచి ప్రతి నియోజకవర్గానికి రూ.20 కోట్ల వరకు కేటాయించాం.
- నిర్మాణ రంగంలోని వారికి దీనివల్ల ఉపాధి లభిస్తుంది.
- విద్యార్ధులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాల పేరు మార్పు సిఎం దృష్టికి వచ్చింది.
- ఆయన దీనిపై సీరియస్ గా స్పందించారు.
- అబ్దుల్ కలాం పేరుమీదే ఈ పురస్కారాలు వుండాలని ఆదేశించారు.
- అలాగే ఇటువంటి పురస్కారాలకు మహాత్మగాంధీ, అంబేద్కర్, పూలే, జగజ్జీవన్ రామ్ వంటి మహనీయుల పేర్ల మీద ఇవ్వాలని కూడా సిఎం ఆదేశించారు.