గవర్నర్ జోక్యం చేసుకోవాలి

గవర్నర్ జోక్యం చేసుకోవాలి          
*ఏపీయుడబ్ల్యూ జే వినతి * గవర్నర్ ను కలసి వినతిపత్రం అందజేసిన నేతలు
 మీడియా స్వేచ్ఛ కి భంగం కలిగించే జీఓ నెంబర్ 2430 ని రద్దు చేయాలన్న డిమాండు విషయంలో రాజ్యంగా పరిరక్షణకులు అయిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఏపీయుడబ్ల్యూజే) కోరింది. ఆమేరకు గురువారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో గవర్నర్ ని యూనియన్ నేతలు కలసి వినతిపత్రం అందజేశారు. ఐజెయు ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేష్ కుమార్, ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, చిన్నమధ్యతరహా పత్రిక సంగం అధ్యక్షుడు నల్లి ధర్మారావు, యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా రవి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, తదితరులు గవర్నర్ ని కలిశారు. తొలుత గవర్నర్ కి జీఓ వలన మీడియా స్వేచ్ఛ కి ఏవిధమైన ముప్పు ఉందొ యూనియన్ నేతలు వివరించారు. ఈ జీఓ విషయం తన దృష్టికి వచ్చిందని పిసిఐ చైర్మన్  కూడా   స్పందించటాన్ని కూడా ఈ రోజు పత్రికలలో చూసాను అని గవర్నర్ యూనియన్ నేతలతో అన్నారు. గతంలో2007 అప్పటిముఖ్యమంత్రి వై ఎస్ రాజాశేఖర్ రెడ్డి జీఓ 938 ని తీసుకొని వచ్చరని, దానిని అప్పుడు కూడా వ్యతిరేక కించడం తో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీఓ ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారని, జీఓ ను రద్దు చేయకపోయినా వినియోగించలేదని యూనియన్ నేతలు గవర్నర్ దృష్టి కి తెచ్చారు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీఓ 2430 చాలా  ప్రమాదకరంగా ఉందని,  తక్షణమే ప్రభుత్వం జీఓ ని ఉపసంహరించుకొనే విధంగా చూడాలని యూనియన్ నేతలు గవర్నర్ ను కోరారు. దేశంలోని జర్నలిస్టుల సంఘాలు, సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రజాస్వామ్యక వాదులు, వివిధ రాజకీయ పార్టీలు ఈ జీఓ ను  వ్యతిరేకేస్తున్నారని గవర్నర్ కి తెలిపారు. ఆమేరకు వివరాలు తో కుడి న వినతిపత్రం ని గవర్నర్ కి యూనియన్ నేతలు అందజేసారు. తప్పకుండా పరిశీలిస్తాన్ని గవర్నర్ హామీ ఇచ్చారు.


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు
వైసీపీ నేతల ఇసుక అక్రమాలను నిరూపిస్తా..