వింజమూరులో వి.ఓ.ఏ ల మానవహారం*

*వింజమూరులో వి.ఓ.ఏ ల మానవహారం*


వింజమూరు: ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాద యాత్రలో ఇచ్చిన హామీలను తు చ తప్పకుండా అమలు చేయడం అభినందించదగిన విషయమని వింజమూరు మండల గ్రామ సహాయకులు అభిప్రాయపడ్డారు. 3 వేల రూపాయల నుండి 10 వేల వరకు జీతాలు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా స్థానిక వెలుగు కార్యాలయం నుండి బంగ్లాసెంటర్ వరకు ర్యాలీగా తరలివచ్చి అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహం చుట్టూ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వెలుగు ఏ.పి.యం శ్రీనివాసరావు, వెలుగు కో ఆర్డినేటర్లు వి.పార్వతమ్మ, లాజర్, వెంకట రమణమ్మ, యు.పార్వతమ్మ, గ్రామ సహాయకులు పాల్గొన్నారు.