కనుల పండువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ ఏర్పాట్లు

కనుల పండువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ ఏర్పాట్ల.                


విజయవాడ :


స్వరాజ్య మైదానం లో ఈ నెల 18  వ తేదీ సోమవారం షష్ఠి రోజున  శ్రీ వ ల్లి , దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణ మహోత్సవ  ఏర్పాట్లు కనులపండువగా జరుగుతున్నాయి. విశాఖ శారద పీఠాధి పతులు  శ్రీ శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వాములు వారిచే  కళ్యాణం మహోత్సవం, కార్తీక  దీపోత్సవం నిర్వహిస్తున్నారు...  శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా  సమితి, గరిమెళ్ళ నాణయ్య చౌదరి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం ఏర్పాట్లు జరుగుతున్నాయి.. శనివారం సాయంత్రం స్వరాజ్య మైదానంలో కల్యాణ మహోత్సవ అంకురార్పణ జరిగింది. మామిడి లక్ష్మి వెంకట కృష్ణారావు, గరిమెళ్ళ నాణయ్య చౌదరి, దూబగుంట్ల  శ్రీనివాసరావు దంపతులు లక్ష్మి గణపతి  పూజ,  నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపుకొట్టే కాయక్రమంలో పాల్గొన్నారు. మహిళల కోలాటంతో  సందడిగా మారింది. పవిత్ర కార్తీకమాసంలో లోకకల్యాణం, రాష్ట్రాభివృద్ధికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, కోటి దీపోత్స్వమ్ ఏర్పాటు చేయడం ఎంతో శుభకరమని, భక్తులు పాల్గొని  స్వామి వార్ల కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నామని నిర్వాహకులు  గరిమెళ్ళ నాని తెలిపారు.