ఏపీకి 3 కాదు.. 4 రాజధానులుండాలి : మంత్రి శ్రీరంగనాథరాజు

ఏపీకి 3 కాదు.. 4 రాజధానులుండాలి : మంత్రి శ్రీరంగనాథరాజు
రాజమండ్ రి: మూడు రాజధానులకు మద్దతుగా రాజమండ్రిలో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. ఏపీకి మూడు కాదని.. నాలుగు రాజధానులుండాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిని సాంస్కృతిక రాజధాని చేయాలన్నారు. రాజమండ్రి రాజధాని అనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమాశాల్లో సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తానని శ్రీరంగనాథరాజు తెలిపారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉంటే విశాఖలో భూములు ఎలా కొనగలమని ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు విమర్శించారు.