ఎన్.డి.ఆర్.ఎఫ్. శిక్షణ పొందిన 22 మంది సిబ్బంది నెల్లూరు కు కేటాయింపు :కలెక్టర్

నెల్లూరు, తేదీ. 16-4-2020.    
జిల్లా కు 2వేల ట్రూనాట్ మిషన్సు  రావడం జరిగిందని ,   వీటిని హాట్ స్పొట్ లలో వినియోగించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ యం.వి.శేషగిరి బాబు తెలిపారు.       గురువారం సాయంత్రం జడ్పీ ఆవరణలోని డిస్ట్రిక్ ఎమర్జెన్సీ ఆపరేటింగ్ సెంటర్ వద్ద  జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా కు 2 వేల ట్రూనాట్ టెస్టింగ్ ఎక్యుప్మెంట్ రావడం జరిగిందని, వీటిని హాట్ స్పాట్ ప్రాంతాల్లో వినియోగించి , రేపటి లోగా 2 వేల శాంప్లిల్స్ తీయాలని లక్ష్యం గా నిర్ణయించినట్లు తెలిపారు.ట్రూనాట్ మిషన్ ద్వారా రాపిడ్ టెస్ట్ నిర్వహించేందుకు గంట  నుండి గంటన్నర సమయం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి  చేయగా,  ఎన్.డి.ఆర్.ఎఫ్. నుండి శిక్షణ పొందిన 22 మంది సిబ్బంది నెల్లూరు కు రావడం జరిగిందని , వీరి సేవలను వినియోగించుకోనున్నట్లు జిల్లా కలెక్టర్  తెలిపారు. కరోనా నియంత్రణ కు తీసుకోవలసిన చర్యలను పటిష్టంగా అమలు చేసేందుకు డివిజన్ స్థాయిలో రెవిన్యూ డివిజనల్ అధికారి , డిఎస్పీ, డిప్యూటి డి.ఎం. అండ్ హెచ్.ఓ మరియు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో ఒక కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీ  ఆధ్వర్యంలో  డివిజన్ స్థాయి లోని కంటైన్మైంట్ ప్రాంతాల్లో  ప్రైమరీ, సెకండరీ పర్సన్స్ ను గుర్తించి, వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు లాక్ డౌన్ సమయంలో ప్రజలు  సహకరించడం జరిగిందని , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన నేపధ్యంలో    ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్, జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసారు.