పోలవరం పనులపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

*29–04–2020*
*అమరావతి:


పోలవరం పనులపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష


*అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


*జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, పలువురు అధికారులు హాజరు.వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు.కోవిడ్‌–19 నేపథ్యంలో సిమెంటు, స్టీల్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్న అధికారులు..నెలరోజులకుపైగా అత్యంత విలువైన సమయం కోవిడ్‌ కారణంగా పోయిందన్న అధికారులు.ఏప్రిల్‌ 20 నుంచి కాస్త పరిస్థితులు మెరుగుపడ్డాయన్న అధికారులు.ఇప్పుడిప్పుడే సిమెంటు, స్టీల్‌ సరఫరా మొదలవుతోందన్న అధికారులు.సిమెంటు, స్టీల్‌ సరఫరా ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం ఆదేశం.స్పిల్‌వే జూన్‌ నెలాఖరు పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేయాలన్న సీఎం.డిజైన్ల అప్రూవల్స్‌ వీలైనంత త్వరగా తెప్పించాలని సీఎం ఆదేశం.ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రతి పనికి కూడా సూక్ష్మస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలన్న సీఎం.ఈ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలన్న సీఎం.గత సంవత్సరం గోదావరి వరదలను చూశాం: సీఎం.ముంపునకు గురైన ప్రతి కుటుంబాన్నికూడా శరవేగంతో తరలించాలి: సీఎం.వారికి సంబంధించిన సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలి: సీఎం..రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న అవుకు టన్నెల్‌–2, వలిగొండ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి లింకు పనులపైనా సీఎం సమీక్ష. నిర్దేశించుకున్న కాలంలోగా పనులు పూర్తికావాలని సీఎం ఆదేశం. 2020లో ఈ 6 ప్రాజెక్టులు తప్పనిసరిగా ప్రారంభం అవుతాయని అధికారుల హామీ.