నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.

నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ....
రంగంలోకి దిగిన చిన్నబజార్ పోలీసులు::ఫిర్యాదుపై కేసు నమోదు
నెల్లూరు, క్రైమ్, ఏప్రిల్, 3 నెల్లూరు నగరములోని, స్ధానిక జెండావీది నందుగల ఒక ఇంటిలో శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల సమయ ములో చోరీ జరిగింది. పూర్తీ సమాచారం మేరకు నెల్లూరు నగరములోని, స్ధానిక జెండావీది నందు నివాసం ఉండే ముంతాజ్ ఖాతూన్ అనే వృద్దురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం వేకువ జామున 3 గంటల సమయములో ఇంటిలోకి ప్రవేశించి, ఆమెపై దాడికి పాల్పడి ఆమె వంటిపై ఉన్న 5 సవరల నాలుగు బంగారు గాజులు, అరవ సవర బంగారం ఉంగరాన్ని లాక్కొని వెళ్ళారు. విషయం తెలుసుకున్న చిన్నబజార్ సి.ఐ.మధుబాబు, ఎస్.ఐ.రవినాయక్, సిబ్బందితో కలిసి ఇంటిని పరిశీలించారు. చోరీ జరిగిన విధానాన్ని వృద్ధురాలు ముంతాజ్ ఖాతూన్ ను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,దర్యాప్తు ప్రారంభించారు.