మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

పశ్చిమ గోదావరి జిల్లా ,తాడేపల్లిగూడెం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతితానేటి వనిత  వారి స్వగృహమునందు 
మహిళ శిశు సంక్షేమ శాఖ కు సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారుఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రివర్యులు మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అలాగే చిన్నపిల్లలకు పొష్టికాహారం జరుగుతోందని,అయితే లోక్డౌన్ విధించిన వెంటనే పొష్టికాహారం లబ్ధిదారులకు ఏవిధమైన ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో అందిస్తున్న "టేక్ హోం రేషన్ " అందించుటకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈ విధానం మే 8 వరకు కొనసాగుతుంది అని దీనికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు
ఈ టేక్ హోమ్ రేషన్ ద్వారా అందించే బియ్యం,కందిపప్పు,నూనె, పాలు, ఎగ్స్ అదనంగా ఇవ్వటం జరుగుతుందని,ఇవి లబ్ది దారులకు సక్రమంగా అందుతున్నాయో లేదు పి.డి లు పర్యవేక్షించాలని పేర్కొన్నారు, పి.డి లు సి.డి.పి.వో లతో మాట్లాడి క్రింది అధికారులతో సమీక్ష లు జరపాలని ఇబ్బందులు ఉండకుండా చూసుకోవాలని పేర్కొన్నారు..


మహిళ శాఖ ద్వారా నడుపబడే వికలాంగుల హాస్టల్స్,వృద్ధాశ్రమాలు, అలాగే NGO'S చేత నడుపబడే నడుపబడే హోమ్స్, హాస్టల్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు


వికలాంగులకు వృద్ధులకు మరియు ట్రాన్స్ జెండర్ లకు అందించే బెనిఫిట్స్ అందున్నాయో లేదో పరిశీలించమన్నారు


ఇటీవల కర్నూలు జిల్లాలోని చెన్నెమ్మ అనే అంగనవాడి వర్కర్ గర్భవతి అయిన దివ్య భారతి అనే మహిళను హాస్పిటల్ నందు చేర్పించి ప్రసవం సుఖంతం అయ్యేటట్లు చేసిన ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు


అదే విధంగా ఇప్పుడున్న కరోన వైరస్ నేపద్యంలో  బాల సదనములు, శిశు విహారాలకు, వికలాంగులకు మరియు సీనియర్ సిటిజెన్స్ కొరకు ఈ శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమములపై  మంత్రి వర్యులుతానేటి వనిత గారు చర్చించారు


ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న  ధమయంతి IAS, ప్రిన్సిపల్ సెక్రెటరీ; కృతిక శుక్ల IAS, డైరెక్టర్, మరియు రాష్ట్రం లోని నలుగురు RJD లు, 13 జిల్లాలలోని PD లు మరియు అసిస్టెంట్ డైరెక్టర్,డిసేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ‌వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు