భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు

భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు riవింజమూరు, ఏప్రిల్ 13 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు తెలుగుదేశం పార్టీ నేతలు సోమవారం నాడు పలు ప్రభుత్వ శాఖల విభాగాలలో పని చేస్తున్న సిబ్బందికి భోజనాల ప్యాకెట్లు అందజేశారు. స్థానిక తహసిల్ధారు కార్యాలయం వద్ద తహసిల్ధారు సుధాకర్ రావు, ఎస్.ఐ బాజిరెడ్డిల చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులు, రెవిన్యూ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీసు సిబ్బంది, జర్నలిస్టులకు ఈ భోజన ప్యాకెట్లును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ చల్లా.వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ ప్రకటించి ఈ వైరస్ వ్యాప్తిని కొంతమేర నియంత్రించినట్లయినదన్నారు. లేని పక్షంలో అగ్ర రాజ్యాల మాదిరిగా మన దేశం కూడా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనాల్సి వచ్చేదన్నారు. ప్రధానమంత్రి ముందుచూపు ధోరణి అభినందనీయమన్నారు. ఇందులో భాగంగా ప్రతినిత్యం ప్రజల సం రక్షణ దిశగా కృషి చేస్తున్న ప్రభుత్వ శాఖల సిబ్బందికి ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని.వెంకటరామారావు సూచనల మేరకు భోజనాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టి.డి.పి నేతలు ఖాజావలి, యన్నం.రామచంద్రారెడ్డి, గూడా.నరసారెడ్డి, గురజాల.వాసు, కోడూరు.నాగిరెడ్డి, మంచాల.శ్రీనివాసులు నాయుడు, ఎస్.కే.షరీఫ్, గంగపట్ల.హజరత్తయ్య, చల్లా.శ్రీనివాసులు యాదవ్, ఆరికొండ.శ్రీనివాసులు, బద్దిక.సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.