జర్నలిస్టులకు సీనియర్ జర్నలిస్టు గంట్ల శ్రీనుబాబు సొంత నిధులతో నిత్యావసర సరుకుల పంపిణీ

విశాఖపట్నం న్యూస్


 విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు సీనియర్ జర్నలిస్టు గంట్ల శ్రీనుబాబు సొంత నిధులతో నిత్యావసర సరుకుల పంపిణీ


 


కరోనా వైరస్ సమయంలో  విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు తమ వంతు సాయం అందించాలన దృఢ  సంకల్పముతో సొంత నిధులతో 10 కేజీల బ్రాండెడ్ బియ్యం ఓక లీటరు ఆయిల్ ప్యా కెట్ , కేజీ పంచదార,  చింత పండులను  దశలవారీగా అందించడం  జరుగుతుందని సీనియర్ జర్నలిస్టు  గంట్ల శ్రీనుబాబు తెలిపారు


శనివారం ఉదయం సీతమ్మదార ఆంధ్రప్రభ కార్యాలయంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని  చేపట్టారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ  ఇప్పటికే 70 మంది జర్నలిస్టులకు ఇవ్వడం జరిగిందన్నారు . మరో 132 మంది జాబితా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ఐదు రోజుల పాటు  కొనసాగుతోందని తెలిపారు వెబ్ న్యూస్ ఛానల్ లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు కూడా అందించడం జరుగుతుందన్నారు.  అయితే కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల ఆదుకోవాలని కోరారు తమిళనాడు తరహాలో గుర్తింపు పొందిన జర్నలిస్టులకు నగదు పంపిణీ చేపట్టాలని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల భీమా లో జర్నలిస్టులకు చేర్చాలని కోరారు 
నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులు తమ వంతు సాయంగా జర్నలిస్టులకు సహాయం   చేయాలని ప్రజా  ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ సమయంలో న్యూస్ కవరేజ్ లో తమ ప్రాణాలను సైతం పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలని  ఈ సందర్భంగా  గంట్ల  శ్రీను  బాబు జర్నలిస్టులకు సూచించారు.