గిరిజనుల ప్రయోజనాలు కాపాడాలని సీఎం ఆదేశం

*10–05–2020*
*అమరావతి*


*గిరిజనుల ప్రయోజనాలు కాపాడాలని సీఎం ఆదేశం*


*అమరావతి:*
*గిరిజనుల ప్రయోజనాలు కాపాడాలని సీఎం ఆదేశం*
*జీవో నంబర్‌ 3ను సుప్రీంకోర్టు కొట్టేసిన దరమిలా అడ్వకేట్‌ జనరల్‌తో సమీక్షించిన సీఎం*
*ఎస్టీ ప్రాంతాల్లో టీచర్‌ పోస్టుల్లో ఎస్టీలకు 100శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ  ఉమ్మడి రాష్ట్రంలో జీవో, ఈ జీవోను కొట్టేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు*


*జీవోను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో గిరిజన వర్గాల్లో ఆందోళన*


*ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకు వచ్చిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు*


తమకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన గిరిజన వర్గాల్లో నెలకొందని సీఎంకు వివరించిన ఉపముఖ్యమంత్రి, గిరిజన నేతలు
ఈ అంశంపై ఇప్పటికే దృష్టిసారించిన ముఖ్యమంత్రి
అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌తో సమీక్షించిన సీఎం
గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
తీర్పును క్షుణ్నంగా అధ్యయనం చేసి న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచనలు చేయాలన్న సీఎం
ఉమ్మడి రాష్ట్రంలో విడుదలచేసిన జీవో కాబట్టి, తీర్పు ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఉంటుందని, అందుకనే తెలంగాణ ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుని ముందడుగు వేయాలని సీఎం ఆదేశాలు