ఉపాధి కోల్పోయి జీవనాధారం లేక దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటామన్న నాయి బ్రాహ్మణులు

ఉపాధి కోల్పోయి జీవనాధారం లేక దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటామన్న నాయి బ్రాహ్మణులు .....


కావలి ,మే11 (అంతిమ తీర్పు - N.సాయి )


కరోనా మహమ్మారి వలన గత యాభై రెండు రోజులుగా జీవనోపాధి కోల్పోయి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని  నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాల గురుస్వామి తెలియజేశారు . కావలి ప్రెస్ క్లబ్ లో  సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో         ఆయన మాట్లాడుతూ గత 52 రోజులుగా తమ జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయని శుభకార్యలు లేక సెల్యూన్ షాపులు మూసి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఈ విషయాలన్నీ కావలి సబ్ కలెక్టర్ మరియు  ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి తమ మా సమస్యలను తీసుకెళ్లామని మా ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటంటే ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్ లో షాపులకు అద్దె  రద్దు చేయాలని ప్రతి సెల్యూన్ షాపుకు కరెంటు బిల్లులు రద్దు చేయాలని అలాగే ప్రతి సెల్యూన్ షాపుకు  ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు . సెల్యూన్ షాపులకు అనుమతి ఇస్తే మేము సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి శానిటేషన్ మరియు ఇతర జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాల గురుస్వామి మరియు న్యాయ బ్రాహ్మణుల సంఘం నాయకులు ద్రోణాదుల వెంకట్రావు 
 పాల్గొన్నారు .